నర్సీపట్నం ఉపాధ్యాయినికి యోగాలో గోల్డ్ మెడల్
పుదుచ్చేరి సీఎం రాఘవస్వామి చేతుల మీదుగా గోల్డ్‌మెడల్ అందుకుంటున్న ఉపాధ్యాయుని విజయనిర్మల
నర్సీపట్నం : పుదుచ్చేరి రాష్ట్రంలో జరిగిన అంతర్జాతీయ యోగా పోటీల్లో నర్సీపట్నంకు చెందిన ఉపాధ్యాయుని విజయనిర్మల బంగారు పతకం సాధించారు. పుదుచ్చేరి స్టేట్ డిపార్టుమెంట్ ఆఫ్ టూరిజం వారు డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ వరకు అంతర్జాతీయ యోగా ఛాంపియన్‌షిప్ పోటీలను నిర్వహించారు. పాయకరావుపేట ప్రభుత్వ హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న, నర్సీపట్నంకు చెందిన ఉపాధ్యాయిని పి.విజయనిర్మల ఈ పోటీల్లో పాల్గొన్నారు. 40 ఏళ్ల విభాగంలో విజయనిర్మల బంగారు పతకం సాధించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాఘవస్వామి, టూరిజం మంత్రి లక్ష్మీనారాయణ చేతుల మీదుగా మెడల్ అందుకున్నారు.


