నూకాంబిక ఆలయ హుండీ లెక్కింపు
ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహిస్తున్న అర్చకులు, భక్తులు
అనకాపల్లి : స్థానిక గవరపాలెం దేవదాయ ధర్మదాయశాఖ ఆధ్వర్యంలో నూకాంబిక అమ్మవారి హుండీ లెక్కింపు కార్యక్రమం గురువారం జరిగింది. అమ్మవారి 92 రోజుల హుండీ ఆదాయం రూ.37లక్షల 24వేల 747 రాగా, 05.500 మిల్లీ గ్రాముల బంగారం, ఒక కేజీ 246 గ్రాముల వెండి వచ్చినట్టు జిల్లా సహాయ కమిషనర్ కె.ఎల్.సుధారాణి, ఆలయ ఈవో యళ్ల శ్రీధర్, దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్ వసంతకుమార్ చెప్పారు. భక్తుల ద్వారా అమ్మవారి హుండీకి ఆదాయం వచ్చిందని, నగదు, బంగారం, వెండిని దేవదాయ ధర్మదాయ శాఖ గవరపాలెం యూనియన్ బ్యాంక్ ఖాతాలో జమచేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను, ధర్మకర్తలు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.


