అధిక లోడు వాహనాలపై కేసు నమోదు
కేసు నమోదైన ఇసుక లారీ
అచ్యుతాపురం రూరల్ : మితి మీరిన బరువుతో రాకపోకలు సాగిస్తున్న వాహనాలపై అచ్యుతాపురం పోలీసులు కేసులు నమోదు చేశారు. గురువారం మండలంలో పలు చోట్ల రహదారులపై మితిమీరిన బరువుతో అలాగే గూడ్స్ వ్యాన్లలో మితిమీరిన జనాన్ని తరలించిన వాహనాలపై కేసులు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న ఇసుక లారీపై రూ.20వేల జరిమానా విధించారు. ఇంకా అనేక వాహనాలపై కూడా జరిమానాలు వేసినట్టు ఎస్‌ఐ సుధాకర్ తెలిపారు. ఎవరైనా పరిమితికి మించి వాహనాలు రాకపోకలు చేసినా, ట్రాఫిక్‌కి అంతరాయం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.


