104 ఉద్యోగుల నిరసన
మాడుగుల రూరల్ : 104 మైబెల్ మెడికల్ యూనిట్ ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 104 మైబెల్ మెడికల్ యూనిట్ ఉద్యోగులు యూనియన్ జిల్లా అధ్యక్షుడు శీరంరెడ్డి భార్గవ్ ఆధ్వర్యంలో ముకుందపురం గ్రామంలో అంబేడ్కర్ విగ్రహానికి గురువారం వినతిపత్రం అందజేశారు. ఏడు మాసాల నుంచి ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోగా, అనేక వేధింపులకు గురిచేస్తున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. నిర్వహణ బాధ్యతను నిర్వహిస్తున్న భవ్య హెల్త్ కేర్ సర్వీసు ప్రెవేటు లిమిటెడ్ సంస్ద సిబ్బందికి జీతాలు చెల్లించలేదన్నారు. గతంలో నిర్వహణ బాధ్యతను నిర్వహించిన అరబిందో సంస్ద 104 ఉద్యోగులకు చివరి నెలల్లో చెల్లించిన జీతాల్లో ప్రతి ఉద్యోగికి రూ. 500 నుంచి రూ.2000 వరకు కోతలు విధించిదని, అనేక సంవత్సరాలు నుంచి అమలులో వున్న 15 క్యాజువల్ లీవ్‌లను పూర్తిగా రద్దు చేసిందని, బఫర్ సిబ్బందిని తొలగించిందని, ప్రస్తుత యాజమాన్యం ఉద్యోగ సంఘాల నాయకులకు షోకాజ్ నోటీసులు అందజేసి, సస్పెండ్ చేస్తూ ఆన్ ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్‌కి పాలడుతోందని పేర్కొన్నారు. 104 ఉద్యోగుల సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి చాట్ల రాంబాబు సెలవులో ఉండగా, వాహన తనిఖీల్లో బాధ్యుడిని చేస్తూ గత నెల 16వ తేదీన సస్పెండ్ చేసిందన్నారు. అరబిందో చెల్లించిన చివరి నెల వేతనాలను ప్రతి ఉద్యోగికి కొనసాగించాలని, ఇప్పటి వరకు తగ్గించిన వేతనాలను బకాయిలతో సహా చెల్లించాలని, రద్దు చేసిన క్యాజువల్ లీవ్‌లను పునరుద్ధరించాలని, ఐదేళ్లు కాలపరిమితి పూర్తి చేసుకున్న 104 వాహన డ్రైవర్లకు నూతన స్లాబ్ ప్రకారం వేతనాలు చెల్లించాలని, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు రూ.18,500 వేతనం చెల్లించాలని, తొలగించిన బఫర్ సిబ్బందిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో సిబ్బంది విజయ్, మనీసు, గంగాధర్, పాల్గొన్నారు.
25న సమ్మెకు సిద్ధం..
అనకాపల్లి: ఏపీ 108 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, దఫదఫాలుగా యాజమాన్యంతో చర్చలు జరిపినప్పటికీ పరిష్కరించకోపవడంతో ఈనెల 25న సమ్మెకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా 108 ఉద్యోగుల సంఘం ప్రతినిధి కోటేశ్వరరావు అన్నారు. స్థానిక డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయంలో డీఎంహెచ్‌వో హైమావతికి గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవ్య సంస్థ వచ్చి నేటికి 7 నెలలు చేసుకున్నప్పటీకీ నేటికీ ఏ ఉద్యోగికి అపాయింట్‌మెంట్ లెటర్ ఇవ్వలేదని, ప్రతి నెలా జీతంలో తగ్గుదల జరుగుతుందని, తక్షణమే ఉద్యోగుల పే స్లిప్స్‌ను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వినతి అందజేశారు.
104 ఉద్యోగుల నిరసన


