‘12వ తేదీ నుంచి హైర్ బస్సులు నిలిపివేస్తాం’
అనకాపల్లి: ప్రజా రవాణాశాఖ(ఆర్టీసీ)లో హైర్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమస్యలు పరిష్కరించాలని, సీ్త్ర శక్తి పథకం వల్ల హైర్ బస్ ఓనర్స్ ఇబ్బందులు పడుతున్నారని అసోసియేషన్ ప్రతినిధి కె.శ్రీను అన్నారు. అందువల్ల ఈనెల 12 నుంచి తమ సమస్యలు పరిష్కరించే వరకూ బస్‌లను నిలుపుదల చేస్తామని తెలిపారు. స్థానిక ప్రజారవాణాశాఖ జిల్లా అధికారి వి.ప్రవీణకు గురువారం అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే రెండు కమిటీలతో సమావేశం నిర్వహించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని, సీ్త్ర శక్తి పథకంపై ఒక్కో బస్సుకు సుమారుగా రూ.40వేలు నష్టం వస్తూంటే తూతూ మంత్రంగా కేవలం రూ.5వేలు మాత్రం నష్టం వస్తుందని సర్కులర్ ఇవ్వడం జరిగిందని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు గౌతమ్, కె.దేముడు, కె.జగదీష్, జి.జగ్గారావు, జె.విజయలక్ష్మి, బి.సందీప్ పాల్గొన్నారు.


