చట్టాలపై అవగాహన అవసరం
మాట్లాడుతున్న 9వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి హరినారాయణ
చోడవరం: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని 9వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి హరినారాయణ అన్నారు. చోడవరం చైతన్య బీఈడీ కాలేజీలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు చట్టాలపై న్యాయమూర్తి అవగాహన కల్పించారు. విద్యార్థి దశ నుంచే చట్టాలు తెలుసుకోవడం వల్ల నేరాలకు దూరంగా ఉండవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి వి.గౌరీశంకరరావు, సీఐ పి.అప్పలరాజు, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చీపురపల్లి సూర్యనారాయణ, న్యాయవాది ఎం.జ్యోతి, కాలేజీ కరస్పాండెంట్ లోవరాజు పాల్గొన్నారు.


