
జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు పేట విద్యార్థులు
పాయకరావుపేట: నెల్లూరులోని అక్షర విద్యాలయంలో జరిగిన సీబీఎస్‌ఈ క్లస్టర్ – 7 అథ్లెటిక్స్ పోటీల్లో పాయకరావుపేట విద్యార్థులు సత్తా చాటారు. శ్రీప్రకాష్ విద్యార్థులు ఆదిత్యకుమార్, జయ సత్య, సునీల్ కుమార్, సత్య పవన్, దుర్గాప్రసాద్, ఎం.కేశవ్‌కుమార్ పలు విభాగాల్లో బంగారు, కాంస్య పతకాలు సాధించారు. వీరంతా వారణాసిలోని అతులానంద్ కాన్వెంట్ స్కూల్‌లో జరగనున్న జాతీయ స్థాయి పాటీలకు అర్హత సాధించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విద్యా సంస్థల అధినేత నరసింహారావు, సంయుక్త కార్యదర్శి విజయ్‌ప్రకాష్, ప్రిన్సిపాల్ మూర్తి, వైస్ ప్రిన్సిపాల్ అపర్ణ, కోచ్‌లు చిన్నా, శ్రీరామాంజనేయులు అభినందించారు.