ఇంటర్ ఫలితాలలో శ్రీ ప్రకాష్ విద్యార్ధుల ప్రతిభ
పాయకరావుపేట : శనివారం ప్రకటించిన ఇంటర్మీడియేట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలలో శ్రీ ప్రకాష్ విద్యార్థులు చక్కని ప్రతిభ కనబరిచి ఉత్తమ ఫలితాలు సాధించారని విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి విజయ్ ప్రకాష్ తెలిపారు. తమ కళాశాల నుండి 15 మందికి పైగా విద్యార్థులు 980 కంటే ఎక్కువ మార్కులు సాధించారని తెలిపారు.
మొదటి సంవత్సరం ఎంపీసీలో ఆర్.ఎస్.ఎస్.నగేష్ 464/470, జి.అనూష 460/470, కె.యామిని జ్యోతిక 460/470, జి.లాస్యశ్రీ 460/470 మార్కులు, బైపీసీలో ఆర్.నాగ సూర్యభవ్య 429/440 మార్కులు సాధించారు.
అలాగే ద్వితీయ ఎంపీసీలో ఎ.హర్షిత 988, ఎస్.మేఘన 986, బైపీసీలో ఎం.సత్య అక్షయ 986, సిహెచ్ పూర్ణ శివాని 984 మార్కులు సాధించారు. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్ధులను విద్యా సంస్థల అధినేత సిహెచ్.వి.కె.నరసింహారావు, ప్రిన్సిపాల్ భానుమూర్తి, అకడమిక్ ఇంచార్జి డి.శ్రీలక్ష్మి, విద్యార్ధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఇంటర్ ఫలితాలలో శ్రీ ప్రకాష్ విద్యార్ధుల ప్రతిభ
ఇంటర్ ఫలితాలలో శ్రీ ప్రకాష్ విద్యార్ధుల ప్రతిభ


