బాలిక ఆచూకీ లభ్యం
● 24 గంటల్లో కనుగొన్న పోలీసులు
రావికమతం: జెడ్.కొత్తపట్నం గ్రామానికి చెంది న పదో తరగతి విద్యార్థిని బొబ్బిలి సాయి సంజన(16) అదృశ్యంపై తల్లి కుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కొత్తకోట ఎస్‌ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అనుమానితుల ఫోన్ నంబర్ల ఆధారంగా గాలించారు. చివరగా శుక్రవారం లంబసింగి ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఎస్‌ఐ శ్రీనివాస్ లంబసింగి వెళ్లి బాలికను తీసుకొని వచ్చి తల్లి కుమారికి కొత్తకోట పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులను పలువురు అభినందించారు.


