యలమంచిలి రూరల్: వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే ఉల్లాస్(అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నిగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ) కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండలంలోని పలు చోట్ల వయోజనులకు నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వయోజన విద్యా సంచాలకుడు డి.చిన్నికృష్ణ మండలంలోని లైనుకొత్తూరు కాలనీలో పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. పరీక్ష నిర్వహణ తీరును అయన తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన ఈ పరీక్షలో చదవడం, రాయడం, సంఖ్యా పరిజ్ఞానంపై ప్రశ్నలకు సమాధానాలు రాయించారు. యలమంచిలి ఏపీఎం జి.ఎస్తేరు రాణి ఆయన వెంట ఉన్నారు.


