ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మోసం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మోసం

Mar 18 2025 8:33 AM | Updated on Mar 18 2025 8:33 AM

ప్రభు

ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మోసం

నా కుమారుడు ఇంటి రాకేష్‌ డిగ్రీ పూర్తిచేశాడు. గాజువాకలో పెదగంట్యాడ బీసీ కాలనీకి చెందిన దుంగి దౌపది ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తానని రూ.8 లక్షలు కాజేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆమె వారిని మ్యానేజ్‌ చేస్తోంది. గతంలో రెండుసార్లు కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశాం. అప్పుడు రావికమతం ఎస్‌ఐ పిలిపించి మాట్లాడారు. తరువాత దాని గురించి పట్టించుకోలేదు. కూలీ నాలీ చేసుకుని సంపాదించిన డబ్బులవి. నా కుమారుడికి ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఆ డబ్బంతా ఇచ్చేశాను. కలెక్టర్‌ గారికి ఫిర్యాదు చేశాను. న్యాయం చేస్తామన్నారు. – ఇంటి భాగ్యవతి, మత్సపురం గ్రామం, రావికమతం మండలం

పాసు పుస్తకం కోసం డబ్బులు అడిగారు..

మాకు గునిపూడి రెవెన్యూ పరిధిలో సర్వే నెం.44–5లో 0.45 సెంట్ల భూమి ఉంది. నా భర్త ఏడాది 3 నెలల క్రితం చనిపోయాడు. ఆ భూమిని నా పేరు మీదకు మార్చుకునేందుకు కాళ్లరిగేలా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాను. నా పేరు మీదకు మార్చుకోవడానికి మ్యుటేషన్‌ పెడితే.. అది చెల్లదని వీఆర్వో చెప్పారు. డబ్బులు ఇస్తేనే పని అవుతుందంటున్నారు. పేదరాలిని.. ఇచ్చుకోలేనని చెబితే ఇప్పటికీ పని చేయడం లేదు. స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. కలెక్టర్‌ గారికి అర్జీ ఇచ్చాను.

– వానపల్లి సత్యవతి, గునిపూడి గ్రామం, నక్కపల్లి మండలం

ఆక్రమణదారుడికి రెవెన్యూ అధికారుల వత్తాసు

చేతమెట్ట గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెం.292లో 4.10 ఎకరాల అసైన్డ్‌ భూమిని 1975లో నా భర్త కట్టా కొండయ్యకు ప్రభుత్వం డి–ఫారం పట్టా మంజూరు చేసింది. ఆయన మరణాంతరం నాకు, నా కుమారుడికి స్వాధీన అనుభవ హక్కు ఉంది. అయితే లాలంకోడూరుకు చెందిన మోతుబరి రైతు లాలం గణేష్‌ ఆర్థిక, రాజకీయ బలంతో రాంబిల్లి రెవెన్యూ అధికారులతో కుమ్ముకై ్క 1 బీ అడంగల్‌లో ఆ భూమిని తన తండ్రి పేరున నమోదు చేసుకుని ఆక్రమిస్తున్నాడు. దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. వీఆర్వో రూ.లక్షా 50 వేలు లంచం తీసుకుని మోసం చేశాడు. ఆర్‌టీఐ యాక్టు ప్రకారం విచారించి వీఆర్వోపైన, అతనికి సహకరించిన రెవెన్యూ అధికారులపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.

–కట్టా ఆదమ్మ, ఆమె కుమారుడు, లాలం కోడూరు, రాంబిల్లి మండలం

ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మోసం 
1
1/1

ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మోసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement