పీఎం పాలెం(విశాఖ): ప్రతికూల పరిస్థితుల్లో సాహసోపేతంగా సేవలందించి ఇద్దరు బాధితులను సకాలంలో ఆస్పత్రికి తరలించిన ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని 16వ ఏపీఎస్‌పీ కమాండెంట్ అనీల్‌కుమార్ అభినందించారు. బక్కన్నపాలెం బెటాలియన్‌కు చెందిన ఆర్‌ఎస్‌ఐ వైకుంఠరావు ఆధ్వర్యంలోని ఎస్డీఆర్‌ఎఫ్ బృందం ప్రదర్శించిన ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తిని ప్రశంసించారు. ఈ మేరకు గురువారం నిర్వహించిన కార్యక్రమంలో సిబ్బందిని శాలువాలతో సత్కరించి ప్రశంసాపత్రాలు అందజేశారు.
గర్భిణికి సకాలంలో వైద్యం
అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే మండలం పిటరాయి గ్రామానికి చెందిన 9 నెలల గర్భిణి కోడ చిందరమ్మ, అదే మండలం గంగవరం గ్రామానికి చెందిన పి.పావని తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో వైద్య సహాయం కోసం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్డీఆర్‌ఎఫ్ బృందం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ వారిని ధారకొండ పీహెచ్‌సీకి సురక్షితంగా తరలించింది.
బెటాలియన్‌కు గర్వకారణం
ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది అందించిన సేవలు ఏపీఎస్‌పీ బెటాలియన్‌కు గర్వకారణమని కమాండెంట్ సునీల్‌కుమార్ పేర్కొన్నారు. విధి నిర్వహణలో సిబ్బంది చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


