డోర్లాక్‌ సిస్టమ్‌ను రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

డోర్లాక్‌ సిస్టమ్‌ను రద్దు చేయాలి

Oct 2 2026 12:34 AM | Updated on Oct 2 2026 12:34 AM

తాపీమేస్త్రిల సంఘం డిమాండ్‌

జి.మాడుగుల: భవన నిర్మాణ రంగంలో డోర్లాక్‌ సిస్టమ్‌ను రద్దు చేయాలని, అలాగే సెంట్రింగ్‌ స్లాబ్‌ లెవెల్‌కు 50 బోర్డులకు మించకుండా చర్యలు తీసుకోవాలని శ్రీమత్స్యమాడుగులమ్మ సెంట్రింగ్‌ తాపీ మేసీ్త్ర యూనియన్‌ మండల అధ్యక్షుడు పలాసి గంగాధర్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక రామకోవెల ఆవరణలో గురువారం సెంట్రింగ్‌ తాపీ మేసీ్త్ర, ఎలక్ట్రికల్‌, ప్లంబింగ్‌ యూనియన్‌ల సంయుక్త నెలవారీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులపై యూనియన్‌ సభ్యులందరూ కలిసి చర్చించారు. ఇదే సమయంలో ఎలక్ట్రికల్‌ యూనియన్‌ సమస్యలకు పూర్తి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు దుర్గ, ప్రధాన కార్యదర్శి శివ, కోశాధికారులు రవికుమార్‌, బాబూరావు; ఎలక్ట్రికల్‌ యూనియన్‌ మండల అధ్యక్షుడు వాసు, ఉపాధ్యక్షులు జగదీష్‌, చందు, చింటు మరియు ఇతర యూనియన్‌ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement