హైవేపై కారు ఢీకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

హైవేపై కారు ఢీకొని వ్యక్తి మృతి

Oct 2 2026 12:34 AM | Updated on Oct 2 2026 12:34 AM

సబ్బవరం/దేవరాపల్లి : అనకాపల్లి–ఆనందపురం జాతీయ రహదారిపై మండలంలోని చిన్నయ్యపాలెం వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. స్థానిక ఎస్‌ఐ సింహాచలం తెలిపిన వివరాలు.. దేవరాపల్లి మండలంలోని రైవాడకు చెందిన సీర వెంకటరావు(52) చిన్నయ్యపాలెం వద్ద కాలకృత్యాలు తీర్చుకోనేందుకు వెళ్లి రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో అనకాపల్లి నుంచి పెందుర్తి వైపు వెళ్తున్న కారు ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడ్డ వెంకటరావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్‌ ప్రాంతీయ వైద్యశాలకు తరలించామన్నారు.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వెంకటరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement