స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం

Oct 1 2026 4:28 AM | Updated on Oct 1 2026 4:28 AM

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడువిశ్వేశ్వరరాజు

చింతపల్లి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త సమష్టిగా శ్రమించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక కల్యాణ మండపంలో మండల పార్టీ అధ్యక్షుడు పాంగి గణబాబు అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీకి కీలకమని, ప్రతి పంచాయతీలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగిరేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసే లక్ష్యంతో అందరూ ఐక్యంగా పనిచేసి అభ్యర్థుల గెలుపునకు బాటలు వేయాలని కోరారు. ఎక్కడా రెబల్‌ అభ్యర్థులు లేకుండా పంచాయతీ స్థాయిలోనే దీటైన అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలని సూచించారు.

పార్టీ శ్రేణులకు రూ. 5 లక్షల బీమా భద్రత

వైఎస్సార్‌సీపీలో గుర్తింపు కార్డు పొందిన కార్యకర్తలు ప్రమాదవశాత్తు మృతి చెందితే పార్టీ తరఫున రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించేలా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకమని ఎమ్మెల్యే అన్నారు. కార్డుల పంపిణీ సమయంలోనే ఈ శుభవార్త రావడం ఎంతో ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, జెడ్పీటీసీ కొరాబు అనూషదేవి, పోతురాజు బాలయ్యపడాల్‌, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి బూసరి కృష్ణారావు, రాష్ట్ర పార్టీ సంయుక్త కార్యదర్శి తడబారిక సురేష్‌, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు గంపరాయి దిలీప్‌కుమార్‌, రాష్ట్ర ఎస్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్‌, పంచాయతీరాజ్‌ నియోజకవర్గ అధ్యక్షుడు సాగిన గంగన్న పడాల్‌, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు లోచలి వరప్రసాద్‌, మాజీ సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు దురియా పుష్పలత, మాజీ ఎంపీపీలు సాగిన దేవుడమ్మ, కవడం మచ్చమ్మ, మాజీ మార్కెట్‌ చైర్మన్‌ జల్లి హలియారాణి, తదితర మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement