పెదబయలు జీసీసీ బ్రాంచ్‌ మేనేజర్‌ సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

పెదబయలు జీసీసీ బ్రాంచ్‌ మేనేజర్‌ సస్పెన్షన్‌

Oct 1 2026 4:28 AM | Updated on Oct 1 2026 4:28 AM

● కాఫీ కొనుగోళ్ల రికార్డుల్లో అవకతవకలు

● గ్యాస్‌ అక్రమంగా తరలింపుపై చర్యలు

పెదబయలు : స్థానిక గిరిజన సహకార సంస్థ బ్రాంచి పరిధిలో జరిగిన కాఫీ కొనుగోళ్లలో అవకతవకలు చోటుచేసుకోవడంతో జీసీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సోభిక పెదబయలు జీసీసీ బ్రాంచ్‌ మేనేజర్‌ జి.అప్పన్నను సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో బ్రాంచి పరిధిలో గిరిజన రైతుల నుంచి 7 టన్నుల కాఫీ గింజలు కొనుగోలు చేసినప్పటికీ, దానికి సంబంధించిన రికార్డులు సక్రమంగా లేకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. దీనికి తోడు, ఇటీవల పెదబయలు భారత్‌ గ్యాస్‌ వినియోగదారులకు సరఫరా చేయాల్సిన వంట గ్యాస్‌ను బ్లాక్‌లో తరలించిన వ్యవహారం పత్రికల్లో రావడం కూడా మేనేజర్‌ సస్పెన్షన్‌కు మరో ప్రధాన కారణమైనట్టు సమాచారం. ఇలావుండగా పెదబయలు జీసీసీ బ్రాంచ్‌ గత కొన్నేళ్లుగా అక్రమాలకు అడ్డాగా మారిందన్న విమర్శలున్నాయి. గత ఏడాదిలోనూ కాఫీ కొనుగోళ్లు, గ్యాస్‌ లావాదేవీలకు సంబంధించి సుమారు రూ. 1.50 కోట్ల నిధులు దుర్వినియోగం కావడంతో అప్పట్లో పనిచేసిన మేనేజర్‌, అకౌంటెంట్లను సస్పెండ్‌ చేశారు. ఇక్కడకు వచ్చే మేనేజర్లు సంస్థ అభివృద్ధి కంటే అవకతవకలకే పాల్పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఎండీ ఆదేశాల మేరకు మేనేజర్‌ను సస్పెండ్‌ చేసినప్పటికీ, పాడేరు జీసీసీ అధికారులు ఈ విషయాన్ని మీడియాకు తెలియకుండా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేయడం గమనార్హం. మంగళవారం స్థానిక బ్రాంచ్‌ను పాడేరు డీఎం సందర్శించి వెళ్లినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement