కొయ్యూరు: మండలంలోని రాజేంద్రపాలెం ఆస్పత్రిని జిల్లా అదనపు వైద్య ఆరోగ్య అధికారి (ఏడీఎంహెచ్‌వో) ప్రతాప్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా ఆస్పత్రిలోని ల్యాబ్‌ను పరిశీలించి, పరీక్షలు నిర్వహి స్తున్న తీరుపై ల్యాబ్ టెక్నీషియన్ (ఎల్‌టీ)ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యు లు జగదీష్‌నాయక్‌తో మాట్లాడి ఆస్పత్రి పనితీరును సమీక్షించారు. ఆస్పత్రికి వస్తున్న గర్భిణు లు, చిన్నపిల్లలు, ఇతర రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఏడీఎంహెచ్‌వో ఆరా తీశారు. వైద్యం అందుతున్న తీరుపై రోగుల నుంచి సంతృప్తికరమైన సమాధానం రావడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆ తర్వాత 104 వాహనాన్ని పరిశీలించి, షెడ్యూల్ ప్రకారం సిబ్బంది గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శిస్తున్నా రా లేదా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీహెచ్‌వో ప్రశాంత్ కుమార్, బీఎస్‌కే కిషోర్ కుమార్, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


