ఐక్యంగా పోరాడుదాం | - | Sakshi
Sakshi News home page

ఐక్యంగా పోరాడుదాం

Oct 1 2026 4:28 AM | Updated on Oct 1 2026 4:28 AM

ముంచంగిపుట్టు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సమష్టిగా పోరాడి వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పాంగి పద్మారావు పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని పెదగూడ, ఏనుగురాయి పంచాయతీల్లో ఆయా పంచాయతీల అధ్యక్షులు దాసు, బలరామ్‌ అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వ వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేసి ప్రజలను చైతన్యం చేయాలని కోరారు. అనంతరం పార్టీ కార్యకర్తలకు గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో జేసీఎస్‌ జిల్లా కోఆర్డినేటర్‌ జగబంధు, వైఎస్సార్‌సీపీ మండల ప్రధాన కార్యదర్శులు రాంప్రసాద్‌, పాపారావు, మాజీ సర్పంచులు బాబురావు, నరసింగరావు, రమేష్‌, మాజీ ఎంపీటీసీలు సుబ్బలక్ష్మీ, గణపతి, మండల నేతలు జయదేవ్‌, రామ్మూర్తి, శంకరరావు, అప్పారావు, రాంప్రసాద్‌, సుభాష్‌, నానిబాబు, గాసిరావు, ఉదయ్‌, పిత్‌బాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement