గంజాయి, సారా జోలికి పోవద్దు | - | Sakshi
Sakshi News home page

గంజాయి, సారా జోలికి పోవద్దు

Oct 1 2026 4:28 AM | Updated on Oct 1 2026 4:28 AM

ముంచంగిపుట్టు: గంజాయి, నాటుసారా జోలికి ఎవరూ వెళ్లవద్దని, వాటివల్ల జీవితాలు నాశనమవుతాయని ముంచంగిపుట్టు ఎస్‌ఐ పి. నాని గిరిజనులకు హితవు పలికారు. మండలంలోని బంగారుమెట్ట పంచాయతీ కేంద్రంలో బుధవారం సీఆర్‌పీఎఫ్‌, ఏపీఎస్‌పీ, స్పెషల్‌ పార్టీ పోలీసుల ఆధ్వర్యంలో ’ఆపరేషన్‌ త్రిశూల్‌’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక అంశాలపై గిరిజనులకు విస్తృత అవగాహన కల్పించారు.అనంతరం పోలీసుల ఆధ్వర్యంలో గిరిజనులతో కలిసి బంగారుమెట్టలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో మానవహారంగా ఏర్పడి గంజాయి, నాటుసారా నిర్మూలనపై నినాదాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు, పోలీసు సిబ్బంది, అచీక సంఖ్యలో స్థానిక గిరిజనులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement