● మళ్లీ ఎన్నికలు జరపాల్సిందే
● పప్పుశెట్టిపాలెంలో తల్లిదండ్రుల డిమాండ్
గొలుగొండ: పప్పుశెట్టిపాలెం ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం నిర్వహించిన విద్యా కమిటీ ఎన్నికలు సక్రమంగా జరగలేదని, ఉపాధ్యాయులు అధికార పార్టీకి కొమ్ముకాయడం వల్లే వైఎస్సార్‌సీపీ మద్దతుదారులకు అన్యాయం జరి గిందని, మళ్లీ ఎన్నికలు జరిపే వరకు మా పిల్లలను బడికి పంపేదిలేదని పప్పుశెట్టిపాలెం పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు స్పష్టం చేశారు. ఎన్నికలో అక్రమాలను నిరసిస్తూ బుధవారం ఆందోళన చేశారు. ఈసందర్భంగా పలువురు మాట్లా డుతూ ఎన్నికల్లో అక్రమాలపై జిల్లా విద్యాశాఖ అధికారులకు, నర్సీపట్నం ఆర్డీవోకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. మళ్లీ ఎన్నికలు జరిపిన తరువాతే పిల్లలను పాఠశాలకు పంపుతామన్నారు. ఈ పాఠశాలలో 1 నుంచి ఐదు వరకు 35 మంది విద్యార్థులుండగా బుధవారం 20 మంది విద్యార్థులు హాజరుకాలేదు. దీనిపై జిల్లా విద్యాశాఖ స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.


