సహకార సంఘాల్లో అందుబాటులో ఎరువులు | - | Sakshi
Sakshi News home page

సహకార సంఘాల్లో అందుబాటులో ఎరువులు

Oct 1 2026 4:28 AM | Updated on Oct 1 2026 4:28 AM

అనకాపల్లి: జిల్లాలో సహకార సంఘాలు ద్వారా రైతులకు కావలసిన ఎరువులు అందుబాటులో ఉన్నాయని సహాకార సంఘాల జిల్లా చైర్మన్‌ కోట్ని బాలాజీ అన్నారు. స్థానిక గాంధీనగరం అన్నపూర్ణ బ్యాంక్‌ వద్ద బుధవారం మహాజన సభ సభ్యులతో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సీజన్‌లో 2024–25 సంవత్సరంలో 186 టన్నుల ఎరువులు రైతులకు అందజేయగా, ఈ సీజన్‌లో ఇప్పటివరకు 151 టన్నులు ఎరువులు రైతులకు సరపరా చేయడమైందన్నారు. రైతులు ఎరువుల కోసం, ఎవరూ ఇబ్బంది పడకుండా, అన్నపూర్ణబ్యాంక్‌ సహకార సంఘం వద్ద నేటికి 40 టన్నులు ఎరువులు నిల్వలు ఉన్నాయన్నారు. సభ్యులకు వ్యవసాయ రుణాలతో పాటు ఇతర అవసరాల నిమిత్తం ప్రతిరోజు బంగారు ఆభరణాలపై తక్కువ వడ్డీతో, కేవలం రూ.75 పైసలకి రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సహాకర సంఘం సభ్యులు, డైరెక్టర్లు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

సహకార సంఘాల జిల్లా చైర్మన్‌ కోట్ని బాలాజీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement