ట్రాన్స్‌ఫార్మర్‌పై ఇరుక్కున్న లైన్‌మన్‌ | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌ఫార్మర్‌పై ఇరుక్కున్న లైన్‌మన్‌

Oct 1 2026 4:28 AM | Updated on Oct 1 2026 4:28 AM

విద్యుత్‌ షాక్‌తో గాయాలు

స్థానికుల చొరవతోసురక్షితంగా కిందికి దించిన వైనం

అనకాపల్లి: వీధి దీపాల మరమ్మతులకు వెళ్లిన ఓ విద్యుత్‌ లైన్‌మన్‌ ప్రమాదవశాత్తూ విద్యుత్‌ షాక్‌కు గురై ట్రాన్స్‌ఫార్మర్‌పై ఇరుక్కుపోయిన ఘటన బుధవారం మండలంలో రేబాక గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, తాళ్ల సాయంతో లైన్మెన్‌ను కిందకు దించి, 108 వాహనంలో ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. రేబాక పాలిటెక్నిక్‌ కళాశాలకు వెళ్లే మార్గంలో వీధి దీపాలు వెలగకపోవడంతో వాటిని సరిచేసేందుకు విద్యుత్‌ లైన్‌మన్‌ మంత్రి ఆదినారాయణ ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ విద్యుత్‌ షాక్‌కు గురయ్యారు. దీంతో కుడి చేయి, మెడ భాగంలో గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. విద్యుత్‌ షాక్‌కు గురైన ఆయన ట్రాన్‌న్స్‌ఫార్మర్‌పైనే ఇరుక్కుపోవడంతో అక్కడున్న స్థానికులు వెంటనే స్పందించి, తాళ్లు కట్టి జాగ్రత్తగా కిందికి దించారు. అనంతరం 108 వాహనంలో అనకాపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై విద్యుత్‌ శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement