కబడ్డీ పోటీలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

కబడ్డీ పోటీలు ప్రారంభం

Oct 1 2026 4:28 AM | Updated on Oct 1 2026 4:28 AM

మునగపాక: క్రీడల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు శరీర దారుఢ్యం పెరుగుతుందని మాజీ జెడ్పీటీసీ మళ్ల సంజీవరావు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆడారి కాశీబాబు అన్నారు. స్థానిక నందీశ్వర కళా ప్రాంగణంలో మరిడిమాంబ అమ్మవారి పండగ సందర్భంగా వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌ సహకారంతో ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలను బుధవారం రాత్రి వారు ప్రారంభించారు. మాజీ సర్పంచ్‌ దిమ్మల అప్పారావు, వ్యాపారవేత్త పొలిమేర కృష్ణ, వైఎస్సార్‌సీపీ జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి పిన్నమరాజు రవీంద్రరాజు, పార్టీ నేతలు కోనపల్లి రామ్మోహనరావు,కాండ్రేగుల జగన్‌, రాజా న బుజ్జి, భీశెట్టి ఈశ్వరరావు, పెంటకోట శ్రీనివాసరావు, ఆడారి రమణబాబు, సూరిశెట్టి దుర్గునాయుడు, పీలా శివ, కొణతాల సంతోష్‌, నాగసూరి, మళ్ల హేమంత్‌ తదితరులు పాల్గొన్నారు. రిఫరీగా వెలగా రామకృష్ణ వ్యవహరించారు.

నూతలగుంటపాలెం పాఠశాల తనిఖీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement