సముద్రంలో పడి..వలకు చిక్కుకుని | - | Sakshi
Sakshi News home page

సముద్రంలో పడి..వలకు చిక్కుకుని

Oct 1 2026 4:28 AM | Updated on Oct 1 2026 4:28 AM

మత్స్యకారుడు మృతి

ఎస్‌.రాయవరం: బంగారమ్మపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లి సముద్రంలో పడి బుధవారం మృతి చెందినట్టు ఎస్‌ఐ రమేష్‌ తెలిపారు. ఆయన అందించిన వివరాలిలా ఉన్నాయి. బంగారమ్మపాలెం మొగ నుంచి అయిదుగురు వ్యక్తులు బుధవారం ఉదయం చేపలవేటకు వెళ్లారు. తెప్పపై ఉంటూ వల కట్టుకుంటూ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వల ఎత్తుకునే సమయంలో సముద్రంలో బలమైన గాలులు వేయడం వల్ల అయిదుగురిలో ఒక్కరైన పేర్ల సోమేష్‌(53) సముదంలో పడిపోయాడు. ఈ క్రమంలో వలకు చిక్కుకు పోవడం వల్ల బయటకు తీసేలోపు ప్రాణాలు పోయాయని తోటి మత్స్యకారులు చెప్పినట్టు ఎస్‌ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement