అనకాపల్లి: జీవీఎంసీ విలీన గ్రామమైన కొప్పాక రైల్వే బ్రిడ్జి సమీపంలో ఈనెల 29న రాత్రి సమయంలో సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం వెళుతున్న ఫలక్‌నుమా సూపర్‌ఫాస్టు ఎక్స్‌ప్రెస్ నుంచి బేహర తవిటయ్య అనే ప్రయాణికుడు ప్రమాదవశాత్తూ జారిపడి మృతిచెందినట్టు దువ్వాడ జీఆర్పీ ఎస్‌ఐ కె.టి.ఆర్.లక్ష్మి బుధవారం చెప్పారు. మృతదేహం వద్ద ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించినట్టు ఎస్‌ఐ తెలిపారు. మృతుడిని శ్రీకాకుళం జిల్లా లక్కుపురం గ్రామానికి చెందిన బేహర తవిటయ్యగా గుర్తించడం జరిగిందన్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి అప్పగించడం జరిగిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.


