మహారాణిపేట: విశాఖపట్నం పోర్ట్ అథారిటీకి కార్గో హ్యాండ్లింగ్ డివిజన్ సూపర్‌వైజర్ ఇన్‌చార్జి కె.భీమలింగం చేసిన సేవలు అమూల్యమని వీపీఏ సీనియర్ డిప్యూటీ ట్రాఫిక్ మేనేజర్ సిహెచ్.అవతారం నాయుడు కొనియాడారు. భీమలింగం పదవీ విరమణ సందర్భంగా బుధవారం పోర్ట్ ఆవరణలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన మాట్లాడారు. 1995లో విశాఖ పోర్టులో చేరిన భీమలింగం 31 ఏళ్ల సుధీర్ఘ కాలం తన విలువైన సేవలందించారన్నారు. అరకు పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ తనూజ రాణి మాట్లాడుతూ తమకు సమీప బంధువైన భీమలింగం విశాఖ పోర్టులో పలు పదవుల్లో సమర్థవంతంగా పనిచేసి పదవీ విరమణ చేయడం అభినందనీయమన్నారు. అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ మాట్లాడుతూ భీమలింగం తన పదవులకే వన్నె తెచ్చారన్నారు. ఈ సందర్భంగా భీమలింగం, గుణభూషణి దంపతులను గజమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ అరకు సీనియర్ నాయకుడు చెట్టి వినయ్, బంధు మిత్రులు, సిబ్బంది పాల్గొని భీమలింగం దంపతులను అభినందించారు.


