బంగారుమెట్టలో డీపీ దొంగతనం | - | Sakshi
Sakshi News home page

బంగారుమెట్టలో డీపీ దొంగతనం

Oct 1 2026 4:28 AM | Updated on Oct 1 2026 4:28 AM

బుచ్చెయ్యపేట: మండలంలో గల బంగారుమెట్ట గ్రామంలో విద్యుత్‌ సరఫరా అయ్యే రైతుల వ్యవసాయ ట్రాన్స్‌ఫారం(డీపీ)ని గుర్తు తెలియని వ్యక్తులు పట్టుకుపోయారు. మంగళవారం రాత్రి భీమునిపట్నం, నర్సీపట్నం (బీఎన్‌) రోడ్డును ఆనుకుని డాల్ఫిన్‌ డెయిరీ దగ్గరలో ఉన్న డీపీకి విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. ట్రాన్స్‌ఫారంను కిందికి దించి డీపీని పగలగొట్టారు. డీపీలో ఉన్న రాగి వైర్‌ను, కరెంట్‌ ఆయిల్‌ను పట్టుకుపోయారు. బుధవారం ఉదయం తమ పొలాల్లో ఉన్న మోటార్లకు విద్యుత్‌ సరఫరా రాకపోవడంతో రైతులు డీపీ వద్దకు వెళ్లారు. విద్యుత్‌ ఫీజు పోయి ఉంటుందని చూడడానికి వెళ్లగా డీపీ పగలగొట్టి ఉండడం చూసి రైతులు అవాక్కయ్యారు. వెంటనే విద్యుత్‌శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారం రోజుల కిందటే ఇక్కడకు దగ్గరలోనే ఉన్న మరో ట్రాన్స్‌ఫారంను దొంగలు పగలగొట్టి రాగి వైర్‌ను పట్టుకుపోయారు. ఎవరో కావాలని రాత్రిపూట దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసులు విద్యుత్‌ డీపీలు దొంగతనాలు చేసే వారిపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నా రు. అసలే వర్షాలు లేక పంటలకు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నామని, తక్షణం డీపీ ఏర్పాటు చేసి విద్యుత్‌ సదుపాయం కల్పించి వ్యవసాయ మోటార్లకు నీరు అందేలా చేయాలని బాధి త రైతులు కోలాటి నాగేశ్వరరావు, దాసరి రాజు, పర్రే రాజు, కె.నాగేశ్వరరావు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement