రైతులకు ఇష్టం లేకుంటే పరిశ్రమలు నిలిపివేస్తాం | - | Sakshi
Sakshi News home page

రైతులకు ఇష్టం లేకుంటే పరిశ్రమలు నిలిపివేస్తాం

Oct 1 2026 4:28 AM | Updated on Oct 1 2026 4:28 AM

మాకవరపాలెం: రైతులకు ఇష్టం లేకుంటే పరిశ్రమల ఏర్పాటును నిలిపివేస్తామని స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. పల్లె పండగ–3లో భాగంగా మండలంలోని శెట్టిపాలెంలో పలు అభివృద్ధి పనులకు ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని తూటిపాల ప్రాంతంలో డేటా సెంటర్‌ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఇటీవల రైతులు వినతులు అందజేయడంతో పాటు మీడియా ముఖంగా వెల్లడించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుతో గ్రామాలాభివృద్ధి చెందుతాయని ఉద్దేశంతో ప్రభుత్వంతో మాట్లాడి పరిశ్రమల ఏర్పాటుకు నిర్ణయించామని, కానీ రైతులు వ్యతిరేకించడంతో నిలివేస్తున్నామన్నారు. పల్లెపండగ–3లో పనులకు నియోజకవర్గానికి కేటాయించిన రూ.43.59 కోట్లు నిధులను సక్రమంగా వినియోగించాలని, నాణ్యత లేకుండా పనులు చేస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. మాకవరపాలెంలోని శ్మశానవాటికలో అపరిశుభ్రతలో అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మండల ప్రత్యేకాధికారి కిషోర్‌కుమార్‌, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి సూర్యచంద్ర, టీడీపీ మండల అధ్యక్షుడు పాత్రుడు, శెట్టిపాలెం మాజీ సర్పంచ్‌ రామునాయుడు, ఎంపీడీవో చాయిసుధ, నాయకులు పాల్గొన్నారు.

స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement