వలంటీర్లకు తీవ్ర అన్యాయం
కూటమి ప్రభుత్వ పథకాలతో పాటు, ఎక్కడా లేని అభివృద్ధిని ఉన్నట్లుగా ప్రజల్లో తప్పుడు ప్రచారం చేసేందుకు కోట్ల కొద్దీ ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడం దారుణం. టీడీపీ సోషల్ మీడియాకు ఆర్థికంగా మేలు చేసే కూటమి ప్రభుత్వ చర్యలను ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలి. తక్కువ వేతనాలతో ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసిన వలంటీర్లను కొనసాగించకుండా సీఎం చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారు. – కొమ్మా రాంబాబు, జిల్లా అధ్యక్షుడు, వలంటీర్ల సంఘం, పాడేరు
గ్రామాలలో ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంతో పాటు వారి సంక్షేమం కోసం శ్రమించిన వలంటీర్లను ఉద్యోగాల్లో కొనసాగించకుండా సీఎం చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారు. పది వేల రూపాయల వేతనంతో వలంటీర్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన చంద్రబాబు, ప్రస్తుతం టీడీపీ సోషల్ మీడియాకు ప్రజాధనాన్ని దారాదత్తం చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమంజసం కాదు.
– కొమ్ము సురేష్‌బాబు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, వలంటీర్ల సంఘం, పాడేరు


