● మన్యంలో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
● వణుకుతున్న గిరిజనం
సాక్షి, పాడేరు: ఇంకా శీతాకాలం రాకముందే మన్యం ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతున్నా యి. సాయంత్రం అయిందంటే చాలు చలిగాలులు వీస్తుండగా, అర్ధరాత్రి నుంచి దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీబోర్డులో సోమవారం 18డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 18డిగ్రీలు, మినుములూరులో 17డిగ్రీలు, చింతపల్లిలో 19.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 8 గంటల వరకు కూడా సూర్యుడి దర్శనం ఇవ్వడం లేదు. వంజంగి, చెరువులవెనం కొండలకు పర్యాటకుల తాకిడి కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతోంది.
ముందే ఎంట్రీ..
ఏంటో బాబూ.. ఈసారైతే శీతాకాలం రాకముందే చలి ముందస్తుగానే ఎంట్రీ ఇచ్చేసింది! సాయంత్రం అయిందంటే చాలు.. ఒంటి మీద రగ్గు లేకపోతే బతకలేమన్నట్టు గాలి గట్టిగానే కొడుతోంది. అర్ధరాత్రి దాటిందంటే చాలు, ఇళ్లల్లో ముసుగు తన్నుకుని పడుకోవాల్సి వస్తోంది. తెల్లారితే చాలు బయట అంతా దట్టమైన పొగమంచు.. ఎదురుగా వస్తున్న మనుషులు కూడా సరిగ్గా కనిపించడం లేదు. ఉదయం పూట ఆఫీసులకో, పనులకో వెళ్లేవాళ్లమైతే చలికి గజగజ వణికిపోతున్నాం. ఇంకో నెల రోజుల్లో ఇంకా చలి ఎట్లా ఉంటుందోనని ఇప్పుడే భయమేస్తుంది సామీ.


