నర్సీపట్నం బీజేపీలో విభేదాలు | - | Sakshi
Sakshi News home page

నర్సీపట్నం బీజేపీలో విభేదాలు

Sep 30 2026 1:28 AM | Updated on Sep 30 2026 1:28 AM

● ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాజీనామా

నర్సీపట్నం : నర్సీపట్నం బీజేపీలో విభేదాలు చోటు చేసుకున్నాయి. పార్టీలో కొందరు వ్యవహరిస్తున్న తీరుతో బీజేపీ ఓబీసీ మోర్చ అధ్యక్ష పదవికి డాక్టర్‌ కె.వి.సత్యనారాయణ మంగళవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయాల్సిన కీలక సమయంలో స్థానిక క్యాడర్‌ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా కొందరు వ్యవహరిస్తున్న తీరు బాధ కలిగించిందన్నారు. పార్టీకి నష్టం కలిగిస్తున్నారని సంబంధిత వ్యక్తులను గతంలో పార్టీ అధిష్టానం దూరం పెట్టిందన్నారు. ఇప్పుడు మళ్లీ అదే వ్యక్తులకు ప్రాధాన్యం కల్పించడం బాధ కలిగిస్తుందన్నారు. జిల్లా అధ్యక్ష పదవికి మాత్రమే రాజీనామా చేసానని, పార్టీలో కార్యకర్తగా కొనసాగుతానన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి సమన్వయ సమావేశాల్లో పార్టీ క్యాడర్‌కు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం బాధగా ఉందన్నారు. ఇప్పటికై నా పార్టీ అధినాయకత్వం దృష్టిసారించాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement