స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి | - | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి

Sep 30 2026 1:28 AM | Updated on Sep 30 2026 1:28 AM

మునగపాక : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ కష్టపడి పనిచేయాలని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ కోరారు. మునగపాకలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రసాద్‌తో కలిసి ఆయన క్లస్టర్‌ ఇన్‌చార్జిలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని, ఇందుకోసం పార్టీ తరఫున బలమైన అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో సర్పంచ్‌లతో ఎంపీటీసీలు గెలిచేలా చూడాలన్నారు. ఇందుకోసం క్లస్టర్‌ ఇన్‌చార్జిలు బాధ్యత తీసుకొని గెలుపు గుర్రాలను గుర్తించి వారి విజయం కోసం కష్టపడి పనిచేయాలన్నారు. మాజీ సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో అమలు జరిగిన సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ప్రతి ఒక్కరూ తమకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ పార్టీ జెండాలు రెపరెపలాడేలా చూడాలన్నారు. పార్టీ మండల కన్వీనర్‌ ఆడారి అచ్చియ్యనాయుడు, మాజీ జెడ్‌పీటీసీ మళ్ల సంజీవరావు, మాజీ ఎంపీపీ దాసరి అప్పారావు, మాజీ వైస్‌ ఎంపీపీ దొడ్డి వరహాలు, క్లస్టర్‌ ఇన్‌చార్జిలు షేక్‌ ఇస్నాయిల్‌, కాండ్రేగుల నూకరాజు, సుందరపు తాతాజీ, మొల్లేటి శంకర్‌, పెంటకోట హరేరామ, పెంటకోట నాయుడు, చేకూరి రామరాజు, బొడ్డేడ శ్రీను, ఇల్లా నాగేశ్వరరావు, బొద్దపు శ్రీరామమూర్తి, మొల్లేటి వినోద్‌ పాల్గొన్నారు.

పార్టీ కోసం కష్టపడే వారికి తగిన గుర్తింపు

పదవులు శాశ్వతం కాదని పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని వైఎస్సార్‌సీపీ నేతలు కరణం ధర్మశ్రీ, బొడ్డేడ ప్రసాద్‌ కోరారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శిగా నియమితులైన మొల్లేటి వినోద్‌ మంగళవారం ఇరువురు నేతలను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా వినోద్‌ను సత్కరించి మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement