మీకు నచ్చినోళ్లకు ఓట్లు వేసుకోండి | - | Sakshi
Sakshi News home page

మీకు నచ్చినోళ్లకు ఓట్లు వేసుకోండి

Sep 30 2026 1:28 AM | Updated on Sep 30 2026 1:28 AM

● వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను ● అసెంబ్లీ స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు

నాతవరం : వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని మీకు ఇష్టం వచ్చిన వారికి ఓట్లు వేసుకోవచ్చునని అసెంబ్లీ స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రజలను ఉద్దేశించి అన్నారు. మండలంలో డి.యర్రవరంలో పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నల్లకొండమ్మ తల్లి ఆలయానికి వెళ్లే రోడ్డుకు రూ. 80 లక్షలు, గ్రామంలో వీఽధి రోడ్లకు రూ.16 లక్షలతో సిమెంటు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో అయ్యన్న మాట్లాడారు. తనకు 70 ఏళ్లు వయస్సు పైబడుతుందని, ఇప్పుడున్న నాయకులతో రాజకీయం చేయడం కష్టమన్నారు. తన పదవీ కాలం అనంతరం అరుణాచలం దేవుని సన్నిధిలో ఇల్లు కట్టుకుని భార్యతో కలిసి ఉండాలని కోరుకుంటున్నానన్నారు. నాతవరం మండలానికి 148 పనులకు రూ.21 కోట్లు, నర్సీపట్నం మండలం 104 పనులకు రూ.5 కోట్లు 44 లక్షలు, మాకవరపాలెం మండలానికి 76 పనులకు రూ.10 కోట్లు 10 లక్షలు, గొలుగొండ మండలానికి 93 పనులకు రూ. 6 కోట్లు 20 లక్షలు మంజూరు చేశానన్నారు. సరుగుడు జలపాతానికి ప్రత్యేకంగా కోటి రూపాయలు మంజూరు చేశానన్నారు. ఆయా పనులు నాణ్యతగా చేయించే బాధ్యత స్థానిక నాయకులపై ఉందన్నారు. బాధ్యతగా పని చేయని నాయకులు పక్కకు తప్పుకుంటే కొత్త నాయకులు వస్తారని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కార్పొరేషన్‌ డైరెక్టరు రాజాన వీర సూర్య చంద్ర, నర్సీపట్నం అర్డీవో వి.వి.రమణ, తాండవ ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ కరక సత్యనారాయణ, తహసీల్దార్‌ చందనరేఖ, ఎంపీడీవో సత్య శ్రీనివాస్‌, మాజీ ఎంపీపీ నేతల విజయకుమార్‌, మాజీ సర్పంచ్‌ సత్యవతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement