కనకమహాలక్ష్మికి అష్టదళ పద్మారాధన | - | Sakshi
Sakshi News home page

కనకమహాలక్ష్మికి అష్టదళ పద్మారాధన

Sep 30 2026 1:28 AM | Updated on Sep 30 2026 1:28 AM

డాబాగార్డెన్స్‌ (విశాఖ): బురుజుపేటలో కొలువైన కనకమహాలక్ష్మి దేవస్థానంలో మంగళవారం 108 స్వర్ణ పుష్పాలతో అష్టదళ పద్మారాధన నిర్వహించారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు నిర్వహించిన ఈ పూజలో పలువురు ఉభయదాతలు పాల్గొని తరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కె.శోభారాణి, వేద పండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

ప్లాస్టిక్‌ నిషేధం

పర్యావరణ పరిరక్షణ, విశ్వశాంతిని కాంక్షిస్తూ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా నిషేధించినట్టు ఆలయ ఈవో ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అమ్మవారి అభిషేకానికి తీసుకొచ్చే పాలు, పూజా సామగ్రి విషయంలో ప్లాస్టిక్‌ కవర్లకు బదులుగా గుడ్డ సంచులు, స్టీల్‌ పాత్రలు, గ్లాస్‌ బాటిల్స్‌, మేదరి బుట్టలు వంటి ప్రత్యామ్నాయాలను వినియోగించి దేవస్థానానికి సహకరించాలని ఆమె భక్తులను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement