ఏఎంఆర్‌ సంస్థ ఆగడాలను అరికట్టాలి | - | Sakshi
Sakshi News home page

ఏఎంఆర్‌ సంస్థ ఆగడాలను అరికట్టాలి

Sep 30 2026 1:28 AM | Updated on Sep 30 2026 1:28 AM

అనకాపల్లి: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత రాష్ట్రంలో మైనింగ్‌ను దోచుకుని తింటుందని, ఏఎంఆర్‌ సంస్థ అక్రమ చెక్‌ పోస్టులు, నగదు వసూళ్లు తక్షణమే తొలగించాలని సీపీఎం మండల కన్వీనర్‌ గంటా శ్రీరామ్‌ అన్నారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఏఎంఆర్‌ సంస్థ మైనింగ్‌ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి కోట్లాది ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. క్వారీ యాజమాన్యం చెక్‌ పోస్టుల వద్ద ట్రాక్టర్‌ల యాజమానుల వద్ద రెండేళ్లుగా రుసుముల పేరిట భారీగా దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర మైనింగ్‌ శాఖను పక్కనపెట్టి ఏఎంఆర్‌ సంస్థ ద్వారా కూటమి నాయకులు కోట్లాది రూపాయలు దోచుకోవడం అన్యాయమన్నారు. ఎంపీ సి.ఎం.రమేష్‌ ఆధ్వర్యంలో జిల్లాలో మైనింగ్‌ దందా పెరిగిపోయిందన్నారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు వి.వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ రోజువారి కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న ట్రాక్టర్‌ ఓనర్స్‌, డ్రైవర్స్‌ మైనింగ్‌ మాఫియా దౌర్జన్యాలకు బలైపోతున్నారన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గ్రామీణ ప్రజలు ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్టయితే గ్రామాల్లో మైనింగ్‌ను కాపాడుకోవచ్చన్నారు. కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు కాళ్ల తేలయ్యబాబు, బుగిడి నూక అప్పారావు, కె.ఈశ్వరరావు, ఉరిగిటి సూర్య నారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement