మునగపాకలో పట్ట పగలే చోరీ | - | Sakshi
Sakshi News home page

మునగపాకలో పట్ట పగలే చోరీ

Sep 30 2026 1:28 AM | Updated on Sep 30 2026 1:28 AM

మునగపాక : స్థానిక ఇందిరమ్మ కాలనీలో మంగళవారం పట్టపగలు చోరీ సంఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మునగపాక ఇందిరమ్మ కాలనీలో పట్నాల నానిబాబు కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారు. నానిబాబు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ ఉదయం 7.30 గంటలకు బయటకు వెళ్లాడు. ఇతని భార్య కూడా పనికి వెళ్లింది. పిల్లలు స్కూల్‌కు వెళ్లారు. మధ్యాహ్నం 1.30 గంటలకు నానిబాబు ఇంటికి వచ్చి తాళం తీసి ఇంటిలోపలికి వెళ్లే సరికి బీరువా తెరిచి ఉండడాన్ని గుర్తించి దొంగతనం జరిగినట్టు గ్రహించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిసరాలు పరిశీలించారు పావుతులం బంగారు ఉంగరం, అరతులం బంగారు చైన్‌తో పాటు మూడు జతల వెండి పట్టీలు అపహరణకు గురైనట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రసాదరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement