గిరిజనులతో కలిసి గురువుల శ్రమదానం | - | Sakshi
Sakshi News home page

గిరిజనులతో కలిసి గురువుల శ్రమదానం

Sep 29 2026 1:27 AM | Updated on Sep 29 2026 1:27 AM

ముంచంగిపుట్టు: ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవడంతో ముంచంగిపుట్టు మండలం బూసిపుట్టు పంచాయతీలో గిరిజనులు, ఉపాధ్యాయులు శ్రమదానంతో దెబ్బతిన్న రోడ్డును తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు. మారుమూల బూసిపుట్టు పంచాయతీ కేంద్రంలోని సంతబయలు ప్రాంగణంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మూడు రోజులుగా వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన స్థానిక గిరిజనులు సోమవారం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డు మరమ్మతులకు నడుం బిగించారు. స్థానిక జీపీఎస్‌ పాఠశాల ఉపాధ్యాయులు కూడా గ్రామస్తులతో కలిసి రాళ్లు, మట్టి మోసి రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చారు. ఉపాధ్యాయులు చూపిన చొరవపై గ్రామ గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement