అనకాపల్లి: పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం, జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక మెయిన్‌రోడ్డు జీవీఎంసీ కార్యాలయం వద్ద ఆదివారం పార్టీ ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్‌తో నిరసన వ్యక్తం చేశారు. యుద్ధాన్ని సాకుగా చూపి చమురు ధరలను విపరీతంగా పెంచడం దుర్మార్గమన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్‌పై రూ.8 పెంచడంతో పా టు కమర్షియల్, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధర ను భారీగా పెంచి ప్రజల నడ్డివిరిచారన్నారు. పొదుపు చర్యలు చేపట్టండి, విదేశీ ప్రయాణాలు మానేయండి, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వినియోగించండి అని చెబుతున్న ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబులు విదేశీ పర్యటనలో చార్టెడ్ ఫ్లైట్లు, హెలికాప్టర్లు వాడుతున్నారన్నారు. బయటికి మాత్రం సైకిల్ తొక్కుతూ ప్రచార ఆర్భాటాలు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు, ఆర్.శంకరరావు, గంటా శ్రీరామ్, గనిశెట్టి సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు ఆర్.రాము, వి.వి.శ్రీనివాసరావు, జి.దేముడు నాయుడు, ఎం.రాజేష్, కాళ్ల తెల్లయ్యబాబు, కె.సుభాషిణి, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.


