గుర్తు తెలియని మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని మహిళ మృతి

Jun 8 2026 6:42 AM | Updated on Jun 8 2026 6:42 AM

మర్రిపాలెం: కంచరపాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఓ గుర్తుతెలియని మహిళ (సుమారు 45 ఏళ్లు) మృతి చెందింది. జ్ఞానాపురం సెయింట్‌ జోసెఫ్‌ కాన్వెంట్‌ సమీపంలోని ఫుట్‌పాత్‌పై ఆమె మృతదేహం ఉన్నట్లు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ రవికుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు. ఆమె అక్కడ భిక్షాటన చేస్తూ జీవించే మహిళగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement