నక్కలపుట్టులో విద్యుత్ దీపాల
అలంకరణలో మోదకొండమ్మతల్లి ఆలయం
పాడేరు–నక్కలపుట్టు ఆర్‌అండ్‌బీ రోడ్డులో విద్యుత్ దీపాల అలంకరణ
సాక్షి, పాడేరు: మోదకొండమ్మ తల్లి జన్మస్థలంగా, అమ్మవారి పాదాలు ఉన్న పవిత్ర ప్రాంతంగా భక్తులు విశ్వసించే పాడేరు ఘాట్ రోడ్డులోని పాదాల గుడి వద్ద మోదమ్మ ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆలయ నిర్వాహకులైన జన్ని కుటుంబీకులు ప్రతి మూడేళ్లకు ఒకసారి ఈ మోదకొండమ్మ తల్లి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం అనవాయితీ. ఈ నేపథ్యంలో, ఈ ఏడాది కూడా మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాలను మోదాపల్లి ప్రాంతం నుంచి ఆదివారం ఉదయం ఊరేగింపుగా తీసుకువచ్చి ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. మంగళవారం అమ్మవారి అనుపోత్సవాన్ని, బుధవారం మధ్యాహ్నం భక్తులకు భారీ అన్నసమారాధనను నిర్వహించనున్నారు.
నక్కలపుట్టులో...
పాడేరుకు సమీపంలోని కిండంగి పంచాయతీ నక్కలపుట్టులోనూ మోదమ్మ ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల సందర్భంగా ప్రధాన రహదారితో పాటు అమ్మవారి ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సతకంపట్టు నుంచి వంతాడపల్లి తోటలలోని మోదమ్మ పాత ఆలయం వరకు, అలాగే పాడేరు రోడ్డులోని కొత్త ఆలయం వరకు ఘటాల ఊరేగించి ఉత్సవాలను ఊరేగిస్తారు.


