యలమంచిలి యువకుడికి గిన్నిస్‌ బుక్‌లో స్థానం | - | Sakshi
Sakshi News home page

యలమంచిలి యువకుడికి గిన్నిస్‌ బుక్‌లో స్థానం

Jun 7 2026 3:45 AM | Updated on Jun 7 2026 3:45 AM

యలమంచిలి రూరల్‌: యలమంచిలి కాకివానివీధికి చెందిన కె.జగదీష్‌ పాల్‌ ఎలక్ట్రానిక్‌ కీ బోర్డు వాయించడంలో ప్రతిభ చూపి, గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం లభించింది.గత ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జరిగిన నాన్‌ స్టాప్‌ కీ బోర్డ్‌ ప్లే పోటీల్లో జగదీష్‌ పాల్‌ ప్రతిభ చూపి, గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం పొందాడు. ఈ పోటీల్లో 22 దేశాలకు చెందిన సుమారు 2,000 మంది పాల్గొన్నారు. పోటీల్లో భాగంగా దక్షిణ భారత దేశ శాసీ్త్రయ సంగీత సరళి స్వరాలతో పాటు జాతీయ గీతాన్ని ఆలపిస్తూ ఎలక్ట్రానిక్‌ కీ బోర్డును గంట సేపు వాయించాడు.ఈ మేరకు జగదీష్‌ పాల్‌కు శనివారం పెందుర్తి ఐపీసీ చర్చిలో ధ్రువీకరణపత్రం,మెడల్‌ అందజేసి అభినందించారు. జగదీష్‌ పాల్‌ తండ్రి పీటర్‌ పట్టణంలో కాకివాని వీధిలో జేసీపీఎఫ్‌ చర్చి నిర్వహిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement