రక్షిత మంచినీటి పథకం పరిశీలన | - | Sakshi
Sakshi News home page

రక్షిత మంచినీటి పథకం పరిశీలన

Jun 7 2026 3:45 AM | Updated on Jun 7 2026 3:45 AM

సంపతిపురం వద్ద సమగ్ర రక్షిత నీటి పథకాన్ని పరిశీలిస్తున్న జెడ్పీ సీఈవో

నారాయణమూర్తి, బృందం

కశింకోట: సమగ్ర భారీ రక్షిత మంచినీటి పథకాన్ని శనివారం జెడ్పీ సీఈవో నారాయణమూర్తి పరిశీలించారు. కశింకోటకు సమీపంలో సంపతిపురం వద్ద అధికారుల బృందంతో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం ఏలేరు కాలువ నీటిని నిల్వ ఉంచే జలాశయాన్ని పరిశీలించారు. వేసవి సందర్భంగా తాగునీటికి ఇబ్బంది కలగకుండా సమర్థంగా పథకాన్ని నిర్వహించాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారి సందీప్‌, ఎంపీడీవో సీహెచ్‌. చంద్రశేఖర్‌రావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ శ్రీనివాస్‌, ఏవో ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement