మహిళను వేధించిన రౌడీ షీటర్‌కు రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

మహిళను వేధించిన రౌడీ షీటర్‌కు రిమాండ్‌

Jun 7 2026 3:45 AM | Updated on Jun 7 2026 3:45 AM

అచ్యుతాపురం రూరల్‌: సోషల్‌ మీడియాలో అవమానకర పోస్టులు పెట్టి మహిళను కించపరిచిన రౌడీ షీటర్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్‌ విధించినట్టు సీఐ చంద్రశేఖరరావు శనివారం తెలిపారు. పూడిమడక గ్రామానికి చెందిన ఎరిపల్లి కాసులు (కిరణ్‌) అదే గ్రామానికి చెందిన మహిళను లక్ష్యంగా చేసుకుని సోషల్‌ మీడియాలో అవమానకర పోస్టులు పెట్టడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేసి, నిందితుడిని అరెస్టు చేసి, యలమంచిలి కోర్టులో హాజరు పరచగా న్యాయస్థానం రిమాండ్‌ విధించడంతో కేంద్ర కారాగారానికి తరలించినట్టు సీఐ చెప్పారు. కిరణ్‌పై గతంలో రాంబిల్లి, కశింకోట, అచ్యుతాపురం పోలీస్‌ స్టేషన్లలో 10 కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. అచ్యుతాపురం పోలీసుస్టేషన్‌లో కిరణ్‌పై రౌడీ షీట్‌ నమోదైంది. అనంతరం అచ్యుతాపురం సీఐ చంద్రశేఖరరావు పూడిమడక సచివాలయంలో గ్రామస్తులతో మాట్లాడుతూ మహిళలను, ఇతర వ్యక్తులను కించపరుస్తూ సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement