నర్సీపట్నం: ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న ముఠాను నాతవరం పోలీసులు అరెస్టు చేశారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు బైక్‌ల చోరీల వివరాలను శనివారం వెల్లడించారు. నాతవరం ఎస్‌ఐ తారకేశ్వరరావు, సిబ్బంది వెదురుపల్లి జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేశారు. అదే సమయంలో బైక్‌పై వస్తున్న ముగ్గురు అనుమానాస్పద వ్యక్తులను సిబ్బంది ఆపేందుకు ప్రయత్నించగా వారు పారిపోయేందుకు యత్నించారు. వారిని వెంబడించి పట్టుకుని విచారించగా నాతవరం పరిసర ప్రాంతాల్లో పలు ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసినట్టు అంగీకరించారన్నారు. నిందితులు మాతిరెడ్డి మనోజ్, కిల్లంపల్లి సుబ్రహ్మణ్యం కిరణ్, వంతల కొండలబాబును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి నాలుగు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. దొంగతనం చేసిన వాహనాలను ఒడిశా ఏజెన్సీ సరిహద్దు ప్రాంతాల్లో విక్రయించి వచ్చిన డబ్బులతో తమ వ్యక్తిగత అవసరాలు, విలాసవంతమైన జీవనానికి అలవాటు పడినట్లు డీఎస్పీ వివరించారు. కొనుగోలు చేసి మైదాన ప్రాంతాలకు తీసుకువచ్చి విక్రయిస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.
నాలుగు బైక్‌లు స్వాధీనం


