స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యం

Jun 6 2026 12:47 AM | Updated on Jun 6 2026 12:47 AM

● ప్రతి పంచాయతీలో పార్టీ జెండా ఎగరాలి● జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు

సాక్షి,పాడేరు: రానున్న స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయడంతో పాటు ప్రతి పంచాయతీలోను వైఎస్సార్‌సీపీ జెండాలు ఎగరాలని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని 26పంచాయతీల నేతలతో తన క్యాంపు కార్యాలయం వద్ద పార్టీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలంతా సమష్టిగా అన్ని పంచాయతీల్లోను వైఎస్సార్‌సీపీ విజయం కోసం కృషి చేయాలన్నారు. ప్రతి గ్రామంలోను గడప గడపకు తిరిగి కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో మోసాలను గిరిజనులకు సమగ్రంగా వివరించాలన్నారు. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్ల కార్యక్రమాన్ని కూడా గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఓటర్ల వెరిఫికేషన్‌పై కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఎండగట్టాలన్నారు. అర్హులందరికీ ఓటు హక్కు ఉండే విధంగా బూల్‌ లెవెల్‌ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యమన్నారు. వైఎస్సార్‌సీపీ ఐడీ కార్డుల వెరిఫికేషన్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ నెల 12న పాడేరులో వైఎస్సార్‌సీపీ తలపెట్టిన నిరసన ర్యాలీని విజయవంతం చేయాలన్నారు.ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు సీదరి రాంబాబుతో పాటు అన్ని పంచాయతీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement