యువకుడిని కాపాడిన లైఫ్‌గార్డులు | - | Sakshi
Sakshi News home page

యువకుడిని కాపాడిన లైఫ్‌గార్డులు

Jun 6 2026 12:41 AM | Updated on Jun 6 2026 12:41 AM

యువకుడిని కాపాడిన పోలీసులు, లైఫ్‌గార్డులు

మహారాణిపేట: కెరటాల ఉధృతికి సముద్రంలో కొట్టుకుపోతున్న ఓ యువకుడిని పోలీసులు, స్విమ్మర్లు కాపాడారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం రాజపురం గ్రామానికి చెందిన ఎం.మణికంఠ మిలటరీ పరీక్షలు రాయడానికి ఇటీవల విశాఖకు వచ్చాడు. శుక్రవారం గోకుల్‌ పార్క్‌ వద్ద తీరంలో స్నానం చేస్తుండగా, ఒక్కసారిగా వచ్చిన అలల ఉధృతికి సముద్రంలోకి కొట్టుకుపోయాడు. గమనించిన కానిస్టేబుల్‌ భాస్కరరావు, లైఫ్‌గార్డులు రవివర్మ, కళ్యాణ్‌ వెంటనే అప్రమత్తమై మణికంఠను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. అనంతరం కౌన్సెలింగ్‌ ఇచ్చి, అతని తమ్ముడు వరుణ్‌కు అప్పగించినట్లు మైరెన్‌ ఎస్‌ఐ ప్రసాద్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement