కశింకోట: మండలంలోని ఉగ్గినపాలెం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. సీఐ అల్లు స్వామినాయుడు అందించిన వివరాల ప్రకారం... అనకాపల్లి నుంచి తాళ్లపాలెం వైపు వెళుతున్న బైక్‌ను ఉగ్గినపాలెం వద్ద వెనుకగా వ్యాన్ వచ్చి ఢీకొంది. దీంతో బైక్ నడుపుతున్న తాళ్లపాలెం శివారు బంగారయ్యపేటకు చెందిన అందపు నాగదుర్గ (18) తీవ్రంగా గాయపడ్డాడు. బైక్ నుజ్జు అయింది. విషయం తెలుసుకున్న మిత్రుడు సింగంపల్లి శేఖర్ సంఘటనా స్థలానికి చేరుకొని నాగదుర్గను అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.వైద్యులు పరీక్షించి మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు నిర్థారించారు. తల్లి లోవలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎస్‌ఐ బి.సతీష్ దర్యాప్తు చేపట్టారని సీఐ తెలిపారు..ప్రమాదానికి కారణమైన వ్యాన్, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు.


