దేవరాపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని మధ్యాహ్న భోజన పథకం జిల్లా కోఆర్డినేటర్ ప్రసాద్, పాయకరావుపేట ఎంఈవో గాంధీ నిర్వాహకులకు సూచించారు. మండలంలోని 53 ప్రభుత్వ పాఠశాలల్లోని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు ఎంఈవో–2 వి. ఉషారాణి ఆధ్వర్యంలో శుక్రవారం ఒక్క రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాణ్యత లోపించకుండా మెనూ ప్రకారం సకాలంలో రుచికరమైన భోజనం అందించాలని ఆదేశించారు. భోజనం తయారీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలను కుక్, హెల్పర్లకు వివరించారు. అనంతరం వంటలను తయారీ చేయించి రుచి చూశారు. కార్యక్రమంలో సీఆర్పీలు రమణ తదితర స్థానిక ఎంఈవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


