పెద్దేరులోకి దూసుకుపోయిన 108 అంబులెన్స్‌ | - | Sakshi
Sakshi News home page

పెద్దేరులోకి దూసుకుపోయిన 108 అంబులెన్స్‌

Jun 6 2026 12:41 AM | Updated on Jun 6 2026 12:41 AM

బుచ్చెయ్యపేట: మండలంలోని వడ్డాది మేజర్‌ పంచాయతీలో 108 అంబులెన్స్‌కు పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం రాత్రి వడ్డాది నుంచి బుచ్చెయ్యపేట వైపు వెళ్తున్న ఈ వాహనం పెద్దేరు నదిపై డైవర్షన్‌ రోడ్డులో డౌన్‌ నుంచి అప్‌ ఎక్కేటప్పుడు ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయి డౌన్‌లోకి జారుకుంది. ఈ క్రమంలో డ్రైవర్‌ బ్రేక్‌ వేసినా పట్టకపోవడంతో దిగువ పెద్దేరు నదిలోకి దూసుకుపోయింది. అంబులెన్స్‌ సగ భాగం డైవర్షన్‌ రోడ్డుపైన, సగ భాగం పెద్దేరు నదిలో గాల్లో వేలాడుతూ ఉండిపోయింది. ఆ సమయంలో అంబులెన్స్‌లో రోగులెవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అంబులెన్స్‌ వెనుక వాహనాలు, పాదచారులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అత్యవసర పరిస్థితిలో రోగులను ఆస్పత్రికి తరలించే 108 అంబులెన్స్‌కు బ్రేక్‌లు పట్టకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కండీషన్‌ లేని 108 వాహనాల వల్ల ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని వాపోతున్నారు.

తప్పిన ప్రమాదం

Advertisement
 
Advertisement
Advertisement