విద్యుత్‌షాక్‌తో పాడి గేదెలు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌షాక్‌తో పాడి గేదెలు మృతి

Jun 6 2026 12:41 AM | Updated on Jun 6 2026 12:41 AM

నాతవరం: విద్యుత్‌ వైర్లు తెగిపడడంతో షాక్‌కు గురై రెండు పాడిగేదెలు మృతిచెందాయి. మండలంలో రాజుపేట అగ్రహం గ్రామానికి చెందిన రెడ్డి నాయుడు శుక్రవారం ఉదయం తన మకాం నుంచి పశువులను మేతకు పొలంలోకి తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో విద్యుత్‌ వైర్లు ఆకస్మాత్తుగా తెగి ముందుగా వెళ్తున్న రెండు పాడి గేదెలపై పడడంతో షాక్‌కు గురై అవి అక్కడికక్కడే మృతిచెందాయి. కొంత దూరంలో నడుస్తున్న రైతు రెడ్డి నాయుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈచుట్టు పక్కల వారు గమనించి సంఘటన స్థలానికి చేరుకుని రైతు నాయుడుకు ధైర్యం చెప్పడంతో పాటు నాతవరం విద్యుత్‌ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని నేలపై పడి ఉన్న విద్యుత్‌ వైర్లను తొలగించారు.అందిన సమాచారం మేరకు పశువైద్యాధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మృతిచెందిన రెండు గేదెలను పరిశీలించారు. వీటి విలువ రూ.2లక్షలుంటుందని అంచనా.

Advertisement
 
Advertisement
Advertisement